22, మే 2013, బుధవారం

We are “just” friends! అంతేన!?!
గజిబిజి బ్రతుకులతో గడియారం గబగబ తిరిగేస్తుంది అనుకుంటూనే మా కాలేజి బస్సు లో ఓ మూలగా ఒదిగి కూర్చున్నా
ఆలోచనల అంతరాలలోకి వెళ్తుంటే ఆనందాల బాల్యం గుర్తుకు వచ్చింది...
బొమ్మల టిఫిన్‌ బాక్సు, రంగురంగుల రబ్బర్లు, రోజూ స్కూల్‌ లో స్నెహితుల గురించి అమ్మకు కధలు కధలు గా చెప్పే ఊసులు
ఆహా! కాలం అక్కడే ఆగిపోయి ఉంటే ఎంత బాగుండును అనిపించింది
నేటి యాంత్రిక జీవితం లో ఏది ఆ ప్రేమ, ఆనందం, ఆప్యాయత?
We are just friends అంటూ హద్దులు విధించుకునే ఈ కాలం లొ స్వచ్ఛమైన స్నెహం ఆశించడం కూడా తప్పేనా?
ఇన్ని ఆలొచనలతో పరిగెడుతున్న నా మనస్సుతో పాటు బస్సు కూడా పరిగెట్టింది,
నా గ మ్యం రానే వచ్చింది
We are “just” friends! అంతేన!?! అని నిట్టూరుస్తూనే బస్సులోని స్నేహితులకు టాటా చెప్పి బస్సు దిగిపొయను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి