అమ్మ
-
The
Image of God
నీవు నీ చిట్టి కాళ్ళ తో నా కడుపులో తన్నిన నాడు భాధపడ్డాను
నా కడుపులో నీకు చోటు చాలలేదని
నీకు గోరు ముద్దలు పెట్టినపుడు నీవు నా వెళ్ళు కొరికిన నాడు ఆనందపడ్డాను
నీకు చిట్టి చిట్టి పళ్ళు వస్తున్నాయని
నీవు తప్పటడుగులు వేసిన నాడు భాధపడ్డాను
క్రింద పడి దెబ్బలు తగులుతాయని
నీవు బడికి వెళ్ళిన నాడు భాధపడ్డాను
బడిలో టీచరు కొడుతుందేమోనని
నీవు ఉద్యోగానికి వెళ్ళి వచ్చి ఆ చికాకులో నన్ను తిట్టిన నాడు భాధపడ్డాను
నీకు శ్రమ ఎక్కువయిందని
నీవు కోడలు వచ్చాక నన్ను పట్టించుకోని నాడు ఆనందపడ్డాను
తను నిన్ను నా కంటే బాగాచూసుకుంటుందని
నీవు నన్ను వృద్ధాశ్రమం లో చేర్చిన నాడు భాధపడ్డాను
నీకు జీతం చాలట్లేదని
నీవు నేను కాటికి చేరిన నాడు నా శవాన్ని క్కల్చడానికి రానప్పుడు ఆనందపడ్డాను
నాకు నిప్పు అంటించేటప్పుడు నీ చెయ్యి కాలదని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి