31, మే 2013, శుక్రవారం


తొలిసారి నిన్ను చూసిన క్షణాణ
గాలులు గోలలై వినిపిస్తుంటే
ఊహలు ఊయలై ఊపుతువుంటే
ఆశలు అలలై ఎగసిపడుతుంటే
నీ రూపు వర్ణించమంటే
శబ్దం కూడా నిశబ్దాన్ని ఆశ్రయించును
నీ సున్నితత్వాన్ని తెలుపమంటే
ప్రక్రృతి కూడా పువ్వునే చూపించును
అందుకేనేమొ రెప్పలు వాల్చక
నా కన్నులు నిన్నే చూస్తువుంటే
నీ చూపులు చురకలై తగలగానే
రెప్ప వేయక తప్పలేదు సుమా!!!

1 కామెంట్‌: