19, మే 2013, ఆదివారం


ఒక్కడివే పుట్టావు
ఒక్కడివే పోతావు
మధ్యలో ఎందుకీ బంధాలు!?!
బాధించటానికా? బ్రతుకు నేర్పటానికా?
ఎందుకీ సహవాసాలు!?!
ఆనందింపచేయటానికా? ఆక్రోసింపచేటానికా?
ఎందుకీ మోహాలు!?!
తప్పటడుగులు వేయించటానికా? తప్పులు సరిచేయటానికా?
ఎందుకీ బాధ్యతలు?
భరించటానికా? బరువు పెంచటానికా?
కారణం ఏదైన?
ఒంటరిగా పుట్టి ఒంటరిగా పోయినా ఒంటరిగ బ్రతకలేం కద!!!
ఆలోచించండి, నే చేప్పింది తప్పంటారా!?!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి