31, మే 2013, శుక్రవారం




నిన్ను వలచి
నన్ను మరచి
నేవై పోయాను
మమసు తెరచి
బ్రతుకు పంచి
బంధమై నిలుస్తావో
కలలు పెంచి
కన్నిట ముంచి
భారమై మిగులితావో
నిన్ను వలచిన మనసు నా మాట వినదు
నన్ను మరచిన నాకు నా జాడ దొరకదు
బంధమైనా, భారమైనా బ్రతుకంతా నీవే....

తొలిసారి నిన్ను చూసిన క్షణాణ
గాలులు గోలలై వినిపిస్తుంటే
ఊహలు ఊయలై ఊపుతువుంటే
ఆశలు అలలై ఎగసిపడుతుంటే
నీ రూపు వర్ణించమంటే
శబ్దం కూడా నిశబ్దాన్ని ఆశ్రయించును
నీ సున్నితత్వాన్ని తెలుపమంటే
ప్రక్రృతి కూడా పువ్వునే చూపించును
అందుకేనేమొ రెప్పలు వాల్చక
నా కన్నులు నిన్నే చూస్తువుంటే
నీ చూపులు చురకలై తగలగానే
రెప్ప వేయక తప్పలేదు సుమా!!!



అబలవని అధికారం చెలాయిస్తున్నా
ఆడదానివని అస్థిత్వం తో ఆడుకుంటున్నా
పడతివని పీడిస్తున్నా
ఇంతివని ఈసడించుకున్నా
అమ్మవై ఆకలి తీర్చడం
ఆలివై అనురాగం పంచడం
రాణివై రాజ్యాన్ని పాలించడం
రంభవై రంజింప చెయడం
ఒక్క నీకే చెల్లుతుంది

24, మే 2013, శుక్రవారం



నువ్వు నన్ను ప్రేమిస్తునవనే ధీమాతో జీవితకాలం బ్రతికేయచ్చు
ప్రేమగా చూస్తుంటావ్‌....
        ప్రేమిస్తున్నాని చెప్పనంటావ్‌!
కష్టాలు తీరుస్తావ్‌...
        కడవరకూ ఉండనంటావ్‌!
నా కోసం ఎంత దూరమైనా వస్తానంటావ్‌...
        ఏడడుగులు వేయనంటావ్‌!
నీ దారి నువ్వు చూసుకుంటే
నా దారి లో ఎన్ని గులబీలు పూచిన ఏం చెసుకోమంటావ్‌!?!
ఎవరికి ఎవ్వమంటావ్‌!?!

22, మే 2013, బుధవారం

We are “just” friends! అంతేన!?!
గజిబిజి బ్రతుకులతో గడియారం గబగబ తిరిగేస్తుంది అనుకుంటూనే మా కాలేజి బస్సు లో మూలగా ఒదిగి కూర్చున్నా
ఆలోచనల అంతరాలలోకి వెళ్తుంటే ఆనందాల బాల్యం గుర్తుకు వచ్చింది...
బొమ్మల టిఫిన్బాక్సు, రంగురంగుల రబ్బర్లు, రోజూ స్కూల్లో స్నెహితుల గురించి అమ్మకు కధలు కధలు గా చెప్పే ఊసులు
ఆహా! కాలం అక్కడే ఆగిపోయి ఉంటే ఎంత బాగుండును అనిపించింది
నేటి యాంత్రిక జీవితం లో ఏది ప్రేమ, ఆనందం, ఆప్యాయత?
We are just friends అంటూ హద్దులు విధించుకునే కాలం లొ స్వచ్ఛమైన స్నెహం ఆశించడం కూడా తప్పేనా?
ఇన్ని ఆలొచనలతో పరిగెడుతున్న నా మనస్సుతో పాటు బస్సు కూడా పరిగెట్టింది,
నా మ్యం రానే వచ్చింది
We are “just” friends! అంతేన!?! అని నిట్టూరుస్తూనే బస్సులోని స్నేహితులకు టాటా చెప్పి బస్సు దిగిపొయను.

21, మే 2013, మంగళవారం

పుడమి తల్లి పగటి నిసిధినిలో ముత్యాల తలంబ్రాలు పోసే వరుని కోసం వగలు దాచి గాలితో కబురంపిన వైనం చూడతరమా!!!!!!!!

19, మే 2013, ఆదివారం


బాట సారి!
బాట తెలియని బాట సారి
బ్రతకటానికి నీ బాట ఏది
తోడు కోసం నీవాగకు
నీడ కోసం వేచియుండకు
విజయం తో సంతోషపడకు
ఓటమి తో రాజీపడకు
బాట తెలియని బాట సారి
లోకం నీ తోడుగ
నీవో పదిమందికి నీడగ
బ్రతకటమే నీ బాట కాగా
నీ బాటను నీకు బ్రతుకు బండి చూపుతుంది
అటుగా సాగిపో ఆఖరిమజిలీ చెరుకో

ఒక్కడివే పుట్టావు
ఒక్కడివే పోతావు
మధ్యలో ఎందుకీ బంధాలు!?!
బాధించటానికా? బ్రతుకు నేర్పటానికా?
ఎందుకీ సహవాసాలు!?!
ఆనందింపచేయటానికా? ఆక్రోసింపచేటానికా?
ఎందుకీ మోహాలు!?!
తప్పటడుగులు వేయించటానికా? తప్పులు సరిచేయటానికా?
ఎందుకీ బాధ్యతలు?
భరించటానికా? బరువు పెంచటానికా?
కారణం ఏదైన?
ఒంటరిగా పుట్టి ఒంటరిగా పోయినా ఒంటరిగ బ్రతకలేం కద!!!
ఆలోచించండి, నే చేప్పింది తప్పంటారా!?!

కష్టాలపై మొహించి
కన్నీళ్ళతో స్నేహించిన నాకు
చిరునవ్వుల చిరునామ
ఆనందాల అందెల సడి తెలియవు
అలాంటి నన్ను నవ్వమంటావేం ప్రియ!
నా నవ్వులో కోటి వెలుగుల కాంతి ఉందంటావేమయ!

18, మే 2013, శనివారం


                                                              అమ్మ
-      The Image of God
నీవు నీ చిట్టి కాళ్ళ తో నా కడుపులో తన్నిన నాడు భాధపడ్డాను
నా కడుపులో నీకు చోటు చాలలేదని
నీకు గోరు ముద్దలు పెట్టినపుడు నీవు నా వెళ్ళు కొరికిన నాడు ఆనందపడ్డాను
నీకు చిట్టి చిట్టి పళ్ళు వస్తున్నాయని
నీవు తప్పటడుగులు వేసిన నాడు భాధపడ్డాను
క్రింద పడి దెబ్బలు తగులుతాయని
నీవు బడికి వెళ్ళిన నాడు భాధపడ్డాను
బడిలో టీచరు కొడుతుందేమోనని
నీవు ఉద్యోగానికి వెళ్ళి వచ్చి ఆ చికాకులో నన్ను తిట్టిన నాడు భాధపడ్డాను
నీకు శ్రమ ఎక్కువయిందని
నీవు కోడలు వచ్చాక నన్ను పట్టించుకోని నాడు ఆనందపడ్డాను
తను నిన్ను నా కంటే బాగాచూసుకుంటుందని
నీవు నన్ను వృద్ధాశ్రమం లో చేర్చిన నాడు భాధపడ్డాను
నీకు జీతం చాలట్లేదని
నీవు నేను కాటికి చేరిన నాడు నా శవాన్ని క్కల్చడానికి రానప్పుడు ఆనందపడ్డాను
నాకు నిప్పు అంటించేటప్పుడు నీ చెయ్యి కాలదని

16, మే 2013, గురువారం


కొంత కాలం దగ్గరగా...
కొంత కాలం దూరంగా...
ఇంకెంత కాలం ఇలా!?!
నిన్నే వెతికే కనులకి చెప్పలేవా...
                        నేను నిన్ను చూస్తూనే ఉన్ననని!
నిన్నే తలిచే మనసుకి చెప్పలేవా...
                        క్షణమూ నిన్ను మరువలేదని!
మరెంత కాలం దాగుడు మూతలు...
                        నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడనికి!!!