ఆశల తీరం
సముద్రతీరాన కూర్చుని చల్లగాలిని ఆశ్వాదిస్తూ ఉంటే
అలల తాకిడికి ఓ చేప
ఒడ్డుకి కొట్టుకు వచ్చింది
మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళాళనే దాని ప్రయత్నం చూస్తే అనిపించింది
జీవం ఉన్న ప్రతీ ప్రాణికి ఆశ సహజం కదా!
కొన్ని తీరని ఆశలు, కొన్ని తీరిన ఆశలు, మరికొన్ని తీరుతాయో లేదో తెలియని ఆశలు
తీరని ఆశలు బాధని
తీరిన ఆశలు ఆనందాన్ని
తీరుతాయో లేదో తెలియని ఆసలు జీవితం పై ఆశని
మిగులుస్తాయి
ఆ సముద్ర తీరం లో మల్లె నా ఆశల
తీరం లో కూడా
దూరం నుంచి కవ్వించిన అలలు కొన్నైతే
నన్ను తాకి అల్లరి చేసిన అలలు ఇంకొన్ని
చాలా బాగారాశారు.
రిప్లయితొలగించండి