28, జూన్ 2013, శుక్రవారం




ముళ్ళై గుచ్చకే గులాబి పువ్వా
వాసనలీవే వయ్యారి పువ్వా
బెట్టు చేయకే బంగారు పువ్వా
పెంచిన మనసును గుచ్చకే కొమ్మా
పంచిన మమతను మరువకే రెమ్మా
గులాబి పువ్వా ముళ్ళై గుచ్చకే!!!


ఎండకి అలసిన నీకు గొడుగును పడితే
నా చేతిని నరికావు
ఆకలిగా ఉన్నావని అన్నం పెడితే
నా వ్రేళ్ళను సైతం పెకలించావు
ప్ర్రాణవాయువును నీకందిస్తే
నా ప్రాణం తీసావు
గుర్తుంచుకో....
మా పచ్చని చెట్లే
మీ ప్రగతికి మెట్లు
మా పచ్చని చెట్లే
మీ నిత్య జీవన నేస్తాలు
కాదని కదిలావో
మీ జాతి కాటికి కాలుచాపినట్టే!!!

16, జూన్ 2013, ఆదివారం

                                              ఆశల తీరం
సముద్రతీరాన కూర్చుని చల్లగాలిని ఆశ్వాదిస్తూ ఉంటే
అలల తాకిడికి చేప ఒడ్డుకి కొట్టుకు వచ్చింది
మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళాళనే దాని ప్రయత్నం చూస్తే అనిపించింది
జీవం ఉన్న ప్రతీ ప్రాణికి ఆశ సహజం కదా!
కొన్ని తీరని ఆశలు, కొన్ని తీరిన ఆశలు, మరికొన్ని తీరుతాయో లేదో తెలియని ఆశలు
తీరని ఆశలు బాధని
తీరిన ఆశలు ఆనందాన్ని
తీరుతాయో లేదో తెలియని ఆసలు జీవితం పై ఆశని మిగులుస్తాయి
సముద్ర తీరం లో మల్లె నా ఆశల తీరం లో కూడా
దూరం నుంచి కవ్వించిన అలలు కొన్నైతే
నన్ను తాకి అల్లరి చేసిన అలలు ఇంకొన్ని

తనను తాకిన అల వెళ్ళిపోయిందని తీరం బాధపడేనా?
గూడు పెట్టిన పక్షి ఎగిరిపోయిందని చెట్టు చితించేనా?
నిన్ను అల్లిన మనిషి వదిలిపోతే నువ్వెందుకు ఏడ్చెవు?
ఎగసి చేరని తీరం లాగా
ఎగిరి పోని చెట్టు లాగా

నీవూ ఉండలేవా!?!