రేపటి తరం వయసు మళ్లాక జీవితం అంటే
మనసుకి అయిన గాయాలని
మేనితో ముడిపడిన ఙపకాలని
గుర్తు చెసుకుంటారేమో!!!
మనం ప్రేమించిన వారితో కలిసి సంతోషంగా ఉండాలి అని కోరుకునే పరిస్థితి లేనప్పుడు
ఎటువంటి పరిస్థితిలో అయినా వారు సంతోషంగా ఉండాలని కోరుకునే హక్కు అయితే ఉంటుంది కదా!!!
నీవేనా...
నిశబ్దపు ఆవలి ఒడ్డు నుంచి నన్ను కలవరించినది
నీవేనా...
ఒంటరితనపు అవతలి వైపు నుంచి నన్ను పలకరించినది
ఇప్పుడు
నేనేం అర్ధం చేసుకోను!!!
ఈ నిశ్శబ్దాన్నా లేక నీ శబ్దాన్నా???
నేనెలా బ్రతకను!!!
ఆ ఏకాంతంలోనా లేక నీ కాంతగానా???
అయినా నా పిచ్చి గాని
కలల్లో కూడా ఈ కలవరపాటు ఎమిటో!!!
5, జులై 2018, గురువారం
కళ్లలో పుట్టి కన్నీటితో జారిపోయేది కాదు ప్రేమంటే
మనసులో పుట్టి మరణించే వరకూ వెంటాడేది ప్రేమంటే