18, సెప్టెంబర్ 2013, బుధవారం

నువ్వు, నీ వాళ్ళు ఉన్నంత వరకూ..... భయమేల!?!

రాభంధులు అంతరించి పోతున్నాయని భయమేల?
నీ చుట్టూ ఉన్నవి చూడు అవి కాదా!
గుడ్లగూబలు అంతరించి పోతున్నాయని భయమేల?
నీ మెదడును తట్టె చెడు ఆలొచనలు చూడు అవి కాదా!
చిరుతపులులు అంతరించి పోతున్నాయని భయమేల?
నీ స్వార్ధపూరిత పనులు చూడు అవి కాదా!
ఇంకెందుకు కౄర మృగాలు అంతరించిపోతాయి!?!

నువ్వు, నీ చుట్టు ఉన్న వాళ్ళు బ్రతికున్నంత కాలం!!!

2, సెప్టెంబర్ 2013, సోమవారం

రాలిపోయే ఆకు
వాలిపోయే కొమ్మ
కురిసిపోయే మేఘం
సాగిపోయే గాలి
అన్నీ మానవుని ఉనికికి సహాయపడితే
మానవుడు మాత్రం వాటిని కలుషితం చేస్తూ
తన మనుగడని తనే కష్టతరం చేసుకుంటున్నాడు
తోటి వారికి సహాయ పడకపోయిన
రండి మనకి మనం సహాయపడదాం
పర్యవర్ణాన్ని పరిరక్షిద్దాం!!!