రాభంధులు
అంతరించి పోతున్నాయని భయమేల?
నీ
చుట్టూ ఉన్నవి చూడు అవి కాదా!
గుడ్లగూబలు
అంతరించి పోతున్నాయని భయమేల?
నీ
మెదడును తట్టె చెడు ఆలొచనలు చూడు అవి కాదా!
చిరుతపులులు
అంతరించి పోతున్నాయని భయమేల?
నీ
స్వార్ధపూరిత పనులు చూడు అవి కాదా!
ఇంకెందుకు
కౄర మృగాలు అంతరించిపోతాయి!?!
నువ్వు, నీ చుట్టు ఉన్న వాళ్ళు బ్రతికున్నంత కాలం!!!