ఏముందని నీకు నాకు మధ్య?
కంటికి రెప్పకి మధ్య నలిగిన కన్నీళ్ళు తప్ప!
ఏముందని నీకు నాకు మధ్య?
మాటకి మౌనానికి మధ్య మిగిలిన నిశ్శబ్దం తప్ప!
ఏముందని నీకు నాకు మధ్య?
నింగికి నేలకి మధ్య ఉన్నంత దూరం తప్ప!
ఏముందని నీకు నాకు మధ్య?
ఏడారికి మంచి నీటికి మధ్యనున్న బంధం తప్ప!
అయినా ఎందుకో ఈ మనసు
నిన్ను చూసి మురిసిపోతుంది
నిన్ను తలచి నవ్వుకుంటుంది!!!
మీ బ్లాగుని "పూదండ" తో అనుసంధానించండి.
రిప్లయితొలగించండిwww.poodanda.blogspot.com
చాలాబాగుంది.
రిప్లయితొలగించండిthanq :)
రిప్లయితొలగించండి