27, జులై 2013, శనివారం

నీవు కలిసిన మట్టినంతటిని చేర్చి నిన్ను గా చేసి


ఆత్మ ఆకాసంలోకి రివ్వున ఎగిరింది
మానవ శరీరం మట్టిలో కలిసింది
అనుకోనే లేదు
ఆనాటి సంతోషాలు ఇంతలా బాధిస్తాయని
నీవు కలిసిన మట్టినంతటిని చేర్చి నిన్ను గా చేసి
అనంత వాయువు లో నీ ఊపిరిని వెతికి నీకు పోయలనిపిస్తుంది
కానీ నాకా అవకాశం లేదే!
నేను చేయగలిగిందల్లా ఒక్కటే
నిరంతరం నీ చింతనలో చింతను దిగమింగి
ఆత్మంతరాల్లోకి వెళ్ళి నీతో కలిసి బ్రతకటం

11, జులై 2013, గురువారం

ఏముందని నీకు నాకు మధ్య?

ఏముందని నీకు నాకు మధ్య?
కంటికి రెప్పకి మధ్య నలిగిన కన్నీళ్ళు తప్ప!
ఏముందని నీకు నాకు మధ్య?
మాటకి మౌనానికి మధ్య మిగిలిన నిశ్శబ్దం తప్ప!
ఏముందని నీకు నాకు మధ్య?
నింగికి నేలకి మధ్య ఉన్నంత దూరం తప్ప!
ఏముందని నీకు నాకు మధ్య?
ఏడారికి మంచి నీటికి మధ్యనున్న బంధం తప్ప!
అయినా ఎందుకో మనసు
నిన్ను చూసి మురిసిపోతుంది

నిన్ను తలచి నవ్వుకుంటుంది!!!

4, జులై 2013, గురువారం

మనదంటూ ఓ ప్రేమ కధ మొదలవుతుంది!!!


నా దంటూ ఉన్నదని గురుతేరాక
నా మనస్సు నీ భావనలు పలికిస్తుంటే
నేనంటూ ఉన్నానని మరిచేపోయి
నా అడుగులు నీవెంటే పడుతూ ఉంటే
నువ్వంటూ ఏమి మిగలక
నాలో లీనమైపోతే

మనదంటూ ప్రేమ కధ మొదలవుతుంది!!!