8, ఆగస్టు 2019, గురువారం

కురిసే కళ్ళకి తెలిసినంతగా
కొట్టుకునే గుండె కి తెలిదేమో
నువ్వు రావని...
మనం గతమని...
అందుకే కన్నీరు కరువై పోయినా
కొలిమి లో కాల్చే అంత
వరకు ఎదురు చూస్తా అనే అంటుంది!!!

27, ఫిబ్రవరి 2019, బుధవారం

మన అనుకొనే వారి కోసం మరణించడానికే మరోసారి ఆలోచించే మనం...
దేశం కోసం ధైర్యంగా దేహ త్యాగం చేసే వారిని దేవుళ్లలా కొలిచినా తప్పు లేదు!!! 

1, ఫిబ్రవరి 2019, శుక్రవారం

కలలు అన్నీ కల్లలు అని తెలిసినా నీకు కన్నీరు రాదెందుకు
నువ్వు మనిషివా??? మానువా???
నీది మనసా??? మట్టి ముద్దా???
ఒకరి కళ్ళలోని సముద్రం లోతు తెలియాలి అంటే
వారు కట్టుకున్న చిరునవ్వుల వంతెన మీద నుంచి చూస్తే సరిపోదు!!!

1, నవంబర్ 2018, గురువారం

రేపటి తరం వయసు మళ్లాక జీవితం అంటే
మనసుకి అయిన గాయాలని
మేనితో ముడిపడిన ఙపకాలని
గుర్తు చెసుకుంటారేమో!!!
మనం ప్రేమించిన వారితో కలిసి సంతోషంగా ఉండాలి అని కోరుకునే పరిస్థితి లేనప్పుడు
ఎటువంటి పరిస్థితిలో అయినా వారు సంతోషంగా ఉండాలని కోరుకునే హక్కు అయితే ఉంటుంది కదా!!!