8, జులై 2018, ఆదివారం

నీవేనా...
నిశబ్దపు ఆవలి ఒడ్డు నుంచి నన్ను కలవరించినది
నీవేనా...
ఒంటరితనపు అవతలి వైపు నుంచి నన్ను పలకరించినది
ఇప్పుడు
నేనేం అర్ధం చేసుకోను!!!
ఈ నిశ్శబ్దాన్నా లేక నీ శబ్దాన్నా???
నేనెలా బ్రతకను!!!
ఆ ఏకాంతంలోనా లేక నీ కాంతగానా???
అయినా నా పిచ్చి గాని
కలల్లో కూడా ఈ కలవరపాటు ఎమిటో!!!

5, జులై 2018, గురువారం

కళ్లలో పుట్టి కన్నీటితో జారిపోయేది కాదు ప్రేమంటే
మనసులో పుట్టి మరణించే వరకూ వెంటాడేది ప్రేమంటే
అమ్మ పిచ్చిది
చందమామ రాదని తెలిసినా పిలుస్తునే ఉంటుంది
అమ్మ వెర్రిది
నాకు మాటలు రావని తెలిసి తానూ నాలాగే మాట్లాడుతుంది
అమ్మ మూర్ఖురాలు
ఎప్పుడూ నా విషయం లో నాన్నతో వాదిస్తుంటుంది
అమ్మ కోపిస్టిది
నన్ను ఎవరన్నా ఎమన్నా అంటే వాళన్ని తిడుతుంది
అమ్మ చెవిటిది
నేను ఎన్నిసార్లు కసురుకున్నా వినిపించదు
అమ్మ స్వార్ధపరురాలు
ఎంత సేపూ పిల్లలు బాగుండాలి అనే కోరుకుంటుంది

Note: ఇన్ని చెడు లక్షణాలు ఉన్న అమ్మను నేను ఎలా పొగడను! అయినా అమ్మకు పిల్లలు చెప్పింది వినడం కన్నా పిల్లలు గురించి చెప్పింది వినడమే ఇష్టం! అందుకే నేను నిన్ను పొగడను!!! నన్ను క్షమించు అమ్మ!!!