అచేతనమైన ఆకాశానికి
అతి చంచలమైన చూపుని అతికించి
ఈ జనారణ్యం లో బ్రతుకెలా అని చూస్తూ ఉండిపోయింది
నలుపు రంగు పూసుకున్న
ఆ నీలాకాసం లోని నక్షత్రాలన్ని
నిన్నటి వరకు ఆమె కళ్ళలో మెరిసేవి
కాని ఆధునికత వీధుల్లో వెర్రి విహారం చేస్తున్న ఈనాడు
ఆమె మాత్రం
దురాచారాల జ్వాలలకు దిష్టిబొమ్మలా తగలబడిపోతూనే ఉంది
కామంధుల రక్కసి గోళ్ళకు బలై రక్తం చిందిస్తూనే ఉంది
కన్నీళ్ళతో జారిపోయిన ఆమె కలల్ని
తిరిగి కళ్ళకి అద్దుకునే ప్రయత్నం లో
ఎన్నో వెక్కిరింతలు, వెకిలి చూపులు
ఎదురుకుంటూనే ఉంది
ఇదే నాగరికత అంటే
సరే మనం నాగారీకులమే!!!