ఏనాడో తాళం వేసిన నా మనస్సు గదిని తెరిస్తే
అందులో
చిరిగిపోయిన చిత్తు కాగితాల్లా
చెదపట్టిన చెక్క ముక్కల్లా
చెల్లా చెదురుగా పడి ఉన్న నీ జ్ఞాపకాలు కనిపిస్తాయి
నాకు మిగిలింది నువ్వు కాదు నీ జ్ఞాపకాలే
అని
గుర్తొచ్చి నేను మౌనంగా రోధిస్తాను
అందుకే మనస్సుకి తాళం వేసి పారేశా!!!
అది దొరికిన వారు నా మనస్సుని మరలా తెరవకండి
తెరచిన వారు నన్ను మరలా ఒంటరిగా విడవకండి