కళ్ళ నిండా కలలతో గుండె నిండా ధైర్యంతో ఆనందపు ఆల్చిప్పలను ఏరుకుంటూ లోకులు అనే సొర చేపల నోటికి చిక్కకుండా కష్టాలు అనే సుడిగుండాలకు బెదరకుండా జీవితపు సంద్రాన్ని ఓర్పుగా ఈదుతూ మనసు కోరిన తీరంలో విజయాలు అనే గవ్వల్ని దోసిటి నిండా చేజిక్కించుకో గలిగితే వందల్లో ఒక్కడిగా నిలుస్తావు పది మందికి ఆదర్శం అవుతావు!!!