మండు వేసంగిలో సీతలత్వాన్ని వెతకినట్టు
నిసి రాతిరిలో సూర్య కాంతిని వెతకినట్టు
పట్ట పగలు చుక్కల్ని వెతకినట్టు
కటిక పేదవాడు జోబి వెతకినట్టు
పరమ లోభి ప్రశంతతను వెతకినట్టు
అవకాశం లేని చోట ఆశాగా వెతుకుతున్నా
పాషానం లాంటి నీ హృదయంలో
నా పై ప్రేమని
గాయపరిచే నీ మాటల్లో
నా జీవిత గమనాన్ని
లోకం పిచ్చిదనుకున్నా
అందరూ గేలి చెస్తున్నా
ఆశ లేకున్నా అత్యాశగా వెతుకుతున్నా!!!