16, ఆగస్టు 2013, శుక్రవారం

నన్నింతలా మార్చి, ఏమార్చి ఎటు పోయావు!?!


కలనైనా మర్చిపోదామని ప్రయత్నించాను
కనుపాపలలో నింపుకున్న నీ రూపాన్ని
కలలన్ని కన్నీటిగా జారినా
కవ్వించే నీ రూపం కనుమరుగవ్వదే!
ఊహనైనా నీ ఊసు మర్చిపోగలనని ఊహించాను
ఊహలన్ని ఉప్పెనై ముంచుతున్నా
ఊరించే నీ మాటల మధురిమ నన్ను విడిచి పోదే!
నన్నింతలా మార్చి, ఏమార్చి ఎటు పోయావు!?!

నన్నిలా వెంటాడి, వేధించి ఏం సాధిస్తావు!?!