16, జూన్ 2013, ఆదివారం
31, మే 2013, శుక్రవారం
తొలిసారి నిన్ను చూసిన క్షణాణ
గాలులు గోలలై వినిపిస్తుంటే
ఊహలు ఊయలై ఊపుతువుంటే
ఆశలు అలలై ఎగసిపడుతుంటే
నీ రూపు వర్ణించమంటే
శబ్దం కూడా నిశబ్దాన్ని ఆశ్రయించును
నీ సున్నితత్వాన్ని తెలుపమంటే
ప్రక్రృతి కూడా పువ్వునే చూపించును
అందుకేనేమొ రెప్పలు వాల్చక
నా కన్నులు నిన్నే చూస్తువుంటే
నీ చూపులు చురకలై తగలగానే
రెప్ప వేయక తప్పలేదు సుమా!!!
24, మే 2013, శుక్రవారం
నువ్వు నన్ను ప్రేమిస్తునవనే ధీమాతో జీవితకాలం బ్రతికేయచ్చు
ప్రేమగా చూస్తుంటావ్....
ప్రేమిస్తున్నాని
చెప్పనంటావ్!
కష్టాలు తీరుస్తావ్...
కడవరకూ ఉండనంటావ్!
నా కోసం ఎంత దూరమైనా వస్తానంటావ్...
ఏడడుగులు వేయనంటావ్!
నీ దారి నువ్వు చూసుకుంటే
నా దారి లో ఎన్ని గులబీలు పూచిన ఏం చెసుకోమంటావ్!?!
ఎవరికి ఎవ్వమంటావ్!?!
22, మే 2013, బుధవారం
We are “just”
friends! అంతేన!?!
గజిబిజి బ్రతుకులతో గడియారం గబగబ తిరిగేస్తుంది అనుకుంటూనే మా కాలేజి బస్సు లో ఓ మూలగా ఒదిగి కూర్చున్నా
ఆలోచనల అంతరాలలోకి వెళ్తుంటే ఆనందాల బాల్యం గుర్తుకు వచ్చింది...
బొమ్మల టిఫిన్ బాక్సు, రంగురంగుల రబ్బర్లు, రోజూ స్కూల్ లో స్నెహితుల గురించి అమ్మకు కధలు కధలు గా చెప్పే ఊసులు
ఆహా! కాలం అక్కడే ఆగిపోయి ఉంటే ఎంత బాగుండును అనిపించింది
నేటి యాంత్రిక జీవితం లో ఏది ఆ ప్రేమ, ఆనందం, ఆప్యాయత?
We are just friends అంటూ హద్దులు విధించుకునే ఈ కాలం
లొ స్వచ్ఛమైన స్నెహం ఆశించడం కూడా తప్పేనా?
ఇన్ని ఆలొచనలతో పరిగెడుతున్న నా మనస్సుతో పాటు బస్సు కూడా
పరిగెట్టింది,
నా గ మ్యం రానే
వచ్చింది
We are “just”
friends! అంతేన!?! అని నిట్టూరుస్తూనే బస్సులోని స్నేహితులకు టాటా
చెప్పి బస్సు దిగిపొయను.
21, మే 2013, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)