19, మే 2014, సోమవారం



నెర్రెలే నగలైన నీ మనస్సుని
అణువణువునా తడిపే జల్లునై
పగలంతా పడిన అలసటని
తీర్చటానికి కమ్ముకొచ్చే చీకటినై
చెలిమి చంద్రుడి ప్రేమ వెన్నెల్లో
పరుగులు తీసే పిల్లగాలి మొసుకొచ్చే మల్లెల సుగంధమై
నీ తలపుల హరివిల్లుకి
వలపుల ఊయల కట్టి
నీ జంటనై ఊగాలనే
నా చిన్ని ఆశ తీరేదేనాటికో!?!

6, ఏప్రిల్ 2014, ఆదివారం


ఏనాడో తాళం వేసిన నా మనస్సు గదిని తెరిస్తే
అందులో
చిరిగిపోయిన చిత్తు కాగితాల్లా
చెదపట్టిన చెక్క ముక్కల్లా
చెల్లా చెదురుగా పడి ఉన్న నీ జ్ఞాపకాలు కనిపిస్తాయి
నాకు మిగిలింది నువ్వు కాదు నీ  జ్ఞాపకాలే అని
గుర్తొచ్చి నేను మౌనంగా రోధిస్తాను
అందుకే మనస్సుకి తాళం వేసి పారేశా!!!
అది దొరికిన వారు నా మనస్సుని మరలా తెరవకండి

తెరచిన వారు నన్ను మరలా ఒంటరిగా విడవకండి

16, మార్చి 2014, ఆదివారం


దారిద్ర్యపు దారుల్లో
ఆకలి చావులెన్నో
దప్పిక కేకలెన్నో
చీకటి త్రోవల్లో
చితికిపోయిన బ్రతుకులెన్నో
సిధిలమవుతున్న దేహాలెన్నో
మురికి వాడల్లో
ముగిసిపోయిన కధలెన్నో
మగ్గిపోతున్న జీవితాలెన్నో
మసక బారిన మనసుకు పరోపకారం అనే పెద పెద కళ్ళద్దాలను తొడిగి
కళ్ళలో పేరుకుపోయిన ఇసుక పొరను తొలగించి చూడండి
వీరిలో కొందరికైనా మన వంతు సహాయం చేసి

చేయూతను అందించాలనిపిస్తుందేమో!!!

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

వసంతాల తీరంలో
విషాంతాల అలై
ప్రశాంతాల దారుల్లో
ప్రమాదాల ముళ్ళై
నీ నిషా కళ్ళ తలపులు
నను నిసి రాతిరి లో వేధిస్తుంటే
ఉషా కాంతుల వెల్లువ దరి చేరనీక
బాధనే వరించాను
కన్నీటిని అక్షతలుగా కురిపిస్తూ
నీ గురుతులనే సాక్ష్యులు చేస్తూ...

11, జనవరి 2014, శనివారం


తొలి రోజులు
తొలి పలుకులు
తుది మజలి ఏదైనా
ప్రయాణం తీయనిది
నా ప్రణయం మరువనిది
నా మలి శ్వాస విడిచే వరకూ
నీ తొలి చూపుల స్పర్స నన్ను వదిలిపోదు
నా ప్రాణాలు అనంత వాయువులలో కలిసే వరకూ
నాకు అనంతము నీవే సఖి!
ఇట్లు నీ నేను...

నా నువ్వు అవుతావని ఎదురు చూస్తూ...

20, డిసెంబర్ 2013, శుక్రవారం


కళ్ళ నిండా కలలతో
గుండె నిండా ధైర్యంతో
ఆనందపు ఆల్చిప్పలను ఏరుకుంటూ
లోకులు అనే సొర చేపల నోటికి చిక్కకుండా
కష్టాలు అనే సుడిగుండాలకు బెదరకుండా
జీవితపు సంద్రాన్ని ఓర్పుగా ఈదుతూ
మనసు కోరిన తీరంలో విజయాలు అనే గవ్వల్ని
దోసిటి నిండా చేజిక్కించుకో గలిగితే
వందల్లో ఒక్కడిగా నిలుస్తావు
పది మందికి ఆదర్శం అవుతావు!!!

8, నవంబర్ 2013, శుక్రవారం


నా చుట్టూ ఆనందాన్ని వెలివేశాను
విషాదాల తీరంలో విహరించాలని
రెప్పల మట్టున ఉప్పెన ముంచుకొస్తున్నా
నా మనస్సనే శిలా ఫలకం పై చెక్కిన నీ గురుతులు చెరిగిపొవనే ధీమాతో

నా పెదవి పై చిరునవ్వుని తరిమేశాను
గాయపరిచే మ్యానికి దగ్గరగా ఉండాలని
గుండెల్లో గునపాలు దిగుతున్నా
నాలో ఆశ చివరి శ్వాస విడిచేలోగా నీ నీడనైనా చేరుకోగలననే ధైర్యంతో

కానీ నాలో ధైర్యాన్ని, ధీమాని నేల రాస్తూ
నీకు విషాదమే శరణ్యమని శపిస్తూ
నీవు చేసిన గాయాలతోనే బ్రతకమని వరమిస్తూ

నన్ను ఒంటరితనమనే ఎడారిలో నిర్ధయగా వదిలేశావ్