20, డిసెంబర్ 2013, శుక్రవారం
8, నవంబర్ 2013, శుక్రవారం
నా
చుట్టూ ఆనందాన్ని వెలివేశాను
విషాదాల
తీరంలో విహరించాలని
రెప్పల
మట్టున ఉప్పెన ముంచుకొస్తున్నా
నా
మనస్సనే శిలా ఫలకం పై చెక్కిన నీ గురుతులు చెరిగిపొవనే ధీమాతో
నా
పెదవి పై చిరునవ్వుని తరిమేశాను
గాయపరిచే
గ మ్యానికి దగ్గరగా ఉండాలని
గుండెల్లో
గునపాలు దిగుతున్నా
నాలో
ఆశ చివరి శ్వాస విడిచేలోగా నీ నీడనైనా చేరుకోగలననే ధైర్యంతో
కానీ
నాలో ధైర్యాన్ని, ధీమాని నేల రాస్తూ
నీకు
విషాదమే శరణ్యమని శపిస్తూ
నీవు
చేసిన గాయాలతోనే బ్రతకమని వరమిస్తూ
నన్ను
ఒంటరితనమనే ఎడారిలో నిర్ధయగా వదిలేశావ్
12, అక్టోబర్ 2013, శనివారం
మండు వేసంగిలో సీతలత్వాన్ని వెతకినట్టు
నిసి రాతిరిలో సూర్య కాంతిని వెతకినట్టు
పట్ట పగలు చుక్కల్ని వెతకినట్టు
కటిక పేదవాడు జోబి వెతకినట్టు
పరమ లోభి ప్రశంతతను వెతకినట్టు
అవకాశం లేని చోట ఆశాగా వెతుకుతున్నా
పాషానం లాంటి నీ హృదయంలో
నా పై ప్రేమని
గాయపరిచే నీ మాటల్లో
నా జీవిత గమనాన్ని
లోకం పిచ్చిదనుకున్నా
అందరూ గేలి చెస్తున్నా
ఆశ లేకున్నా అత్యాశగా వెతుకుతున్నా!!!
18, సెప్టెంబర్ 2013, బుధవారం
నువ్వు, నీ వాళ్ళు ఉన్నంత వరకూ..... భయమేల!?!
రాభంధులు
అంతరించి పోతున్నాయని భయమేల?
నీ
చుట్టూ ఉన్నవి చూడు అవి కాదా!
గుడ్లగూబలు
అంతరించి పోతున్నాయని భయమేల?
నీ
మెదడును తట్టె చెడు ఆలొచనలు చూడు అవి కాదా!
చిరుతపులులు
అంతరించి పోతున్నాయని భయమేల?
నీ
స్వార్ధపూరిత పనులు చూడు అవి కాదా!
ఇంకెందుకు
కౄర మృగాలు అంతరించిపోతాయి!?!
నువ్వు, నీ చుట్టు ఉన్న వాళ్ళు బ్రతికున్నంత కాలం!!!
2, సెప్టెంబర్ 2013, సోమవారం
16, ఆగస్టు 2013, శుక్రవారం
నన్నింతలా మార్చి, ఏమార్చి ఎటు పోయావు!?!
కలనైనా మర్చిపోదామని ప్రయత్నించాను
కనుపాపలలో నింపుకున్న నీ రూపాన్ని
కలలన్ని కన్నీటిగా జారినా
కవ్వించే నీ రూపం కనుమరుగవ్వదే!
ఊహనైనా నీ ఊసు మర్చిపోగలనని ఊహించాను
ఊహలన్ని ఉప్పెనై ముంచుతున్నా
ఊరించే నీ మాటల మధురిమ నన్ను విడిచి పోదే!
నన్నింతలా మార్చి, ఏమార్చి ఎటు పోయావు!?!
నన్నిలా వెంటాడి, వేధించి ఏం సాధిస్తావు!?!
27, జులై 2013, శనివారం
నీవు కలిసిన మట్టినంతటిని చేర్చి నిన్ను గా చేసి
ఆత్మ ఆకాసంలోకి రివ్వున ఎగిరింది
మానవ శరీరం మట్టిలో కలిసింది
అనుకోనే లేదు
ఆనాటి సంతోషాలు ఇంతలా బాధిస్తాయని
నీవు కలిసిన మట్టినంతటిని చేర్చి నిన్ను గా చేసి
అనంత వాయువు లో నీ ఊపిరిని వెతికి నీకు పోయలనిపిస్తుంది
కానీ నాకా అవకాశం లేదే!
నేను చేయగలిగిందల్లా ఒక్కటే
నిరంతరం నీ చింతనలో చింతను దిగమింగి
ఆత్మంతరాల్లోకి వెళ్ళి నీతో కలిసి బ్రతకటం
11, జులై 2013, గురువారం
ఏముందని నీకు నాకు మధ్య?
ఏముందని నీకు నాకు మధ్య?
కంటికి రెప్పకి మధ్య నలిగిన కన్నీళ్ళు తప్ప!
ఏముందని నీకు నాకు మధ్య?
మాటకి మౌనానికి మధ్య మిగిలిన నిశ్శబ్దం తప్ప!
ఏముందని నీకు నాకు మధ్య?
నింగికి నేలకి మధ్య ఉన్నంత దూరం తప్ప!
ఏముందని నీకు నాకు మధ్య?
ఏడారికి మంచి నీటికి మధ్యనున్న బంధం తప్ప!
అయినా ఎందుకో ఈ మనసు
నిన్ను చూసి మురిసిపోతుంది
నిన్ను తలచి నవ్వుకుంటుంది!!!
4, జులై 2013, గురువారం
28, జూన్ 2013, శుక్రవారం
16, జూన్ 2013, ఆదివారం
ఆశల తీరం
సముద్రతీరాన కూర్చుని చల్లగాలిని ఆశ్వాదిస్తూ ఉంటే
అలల తాకిడికి ఓ చేప
ఒడ్డుకి కొట్టుకు వచ్చింది
మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళాళనే దాని ప్రయత్నం చూస్తే అనిపించింది
జీవం ఉన్న ప్రతీ ప్రాణికి ఆశ సహజం కదా!
కొన్ని తీరని ఆశలు, కొన్ని తీరిన ఆశలు, మరికొన్ని తీరుతాయో లేదో తెలియని ఆశలు
తీరని ఆశలు బాధని
తీరిన ఆశలు ఆనందాన్ని
తీరుతాయో లేదో తెలియని ఆసలు జీవితం పై ఆశని
మిగులుస్తాయి
ఆ సముద్ర తీరం లో మల్లె నా ఆశల
తీరం లో కూడా
దూరం నుంచి కవ్వించిన అలలు కొన్నైతే
నన్ను తాకి అల్లరి చేసిన అలలు ఇంకొన్ని
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)